Friday, May 3, 2019


అదివో అల్లదివో శ్రీ హరి వాసము- with Lyrics

కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు

పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు

Vinaro bhagyamu vishnu katha by balakrishna prasad

Vedukundhama

Brahmam Okate - Uthara Unnikrishnan

అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీవుయ్యాల
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల||
ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల
అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల
పదిలముగ వేదములు బంగారు చేరులై పట్ట వెరపై తోచె వుయ్యాల
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల||
మేలు కట్లయి మీకు మేఘమణ్డలమెల్ల మెరుగునకు మెరుగాయె వుయ్యాల
నీల శైలమువంటి నీ మేనికాంతికి నిజమైన తొడవాయె వుయ్యాల
పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు వుయ్యాల
వోలి బ్రహ్మాణ్డములు వొరగువో యని భీతి నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల||
కమలకును భూసతికి కదలు కదలకు మిమ్ము కౌగలింపగజేసె నుయ్యాల
అమరాంగనలకు నీ హాస భావ విలాస మందంద చూపె నీ వుయ్యాల
కమలాసనాదులకు కన్నుల పండుగై గణుతింప నరుదాయె వుయ్యాల
కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె వుయ్యాల||

Vinnapaalu Vinavale - Padmasri Dr.Shobha Raju
విన్నపాలు వినవలె వింత వింతలు
పన్నగపు దోమతెర పైకెత్తవేళయ్యా
తెల్లవారె జామెక్కె దేవతలు మునులు
అల్లనల్ల నంతనింత నదిగోవారే
చల్లని తమ్మిరేకులు సారసపు గన్నులు
మెల్లమెల్లనె విచ్చి మేలుకొనవేలయ్యా
గరుడ కిన్నరయక్ష కామినులు గములై
విరహపు గీతముల వింతాలాపాల
పరిపరివిధముల బాడేరునిన్నదివో
సిరిమొగము దెరచి చిత్తగించవేలయ్యా
పొంకపు శేషాదులు తుంబురునారదాదులు
పంకజభవాదులు నీ పాదాలు చేరి
అంకెలనున్నారు లేచి అలమేలుమంగను
వేంకటేశుడా రెప్పలు విచ్చి చూచి లేవయ్యా

అన్నమయ్య పద తియ్యదనం || BEST OF G.BALAKRISHNA PRASAD - 1

కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు
No comments:
Home

అదివో అల్లదివో శ్రీ హరి వాసము- with Lyrics కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు Vinaro bha...